- పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ల విడుదలకై పిడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై (2,3,4 )72 గంటల డిగ్రీ ,పీజీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్ ను విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు సహకరించి బంద్ ను విజయవంతం చేయాలని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో నీలం రామచంద్రయ్య భవన్లో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో సోమవారం బంద్ ప్ల కార్డ్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీణ్యం చేస్తుందని , కళాశాలల్లో పేద విద్యార్థులు తమ సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలలో కోర్స్ ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కళాశాలలు విద్యార్థుల నుండి ముందుగానే డబ్బులు చెల్లించుకొని ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విద్యార్థుల అకౌంట్స్ కి లింక్ కలిపి రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని అన్నారు. లక్షల రూపాయలు డొనేషన్స్ తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీలు సీట్లు అమ్ముకుంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వ్యాపారం చేస్తున్నాయని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పేద విద్యార్థుల భవిష్యత్ ను నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు నిఖిల్, దేవిక, సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
