నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి సమత పర్యవేక్షణలో పరిశోదక విద్యార్థి ఎల్.టీ. హేమలత ‘సైకలాజికల్ యాస్పెక్ట్స్ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ అనిత నాయర్ ‘ అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథం పై ఓపెన్ వైవా జరిగింది. ఈ ఓపెన్ వైవా కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ మేఘన రావు ఆన్లైన్లో పరిశీలించింది. అనిత నాయర్ కు సంబంధించిన నవలను పూర్తిగా సమీక్షించి పరిశోధక విద్యార్థిని ఎంచుకున్న లక్ష్యాలను పరిశోధక విద్యార్థి నుండి రాబట్టింది. అనంతరం ఎ ల్టి హేమలతకు పిహెచ్డి అవార్డు ప్రధానం చేయాల్సిందిగా విశ్వవిద్యాలయ అధికారులకు ప్రతిపాదనలు పంపింది. ఈ వైవా కు డీన్ ప్రొఫెసర్ లావణ్య హెడ్ డాక్టర్ కె.వి.రమణ చారి, ఫ్యాకల్టీ డాక్టర్ స్వామి రావు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్టి హేమలతకు పలువురు అభినందనలు తెలిపారు.
