27.5 C
Hyderabad
Friday, July 31, 2026

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

Must read

📰 Generate e-Paper Clip

కొనసాగుతున్న ఇందూరు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని సూర్య ప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం చంద్రప్రభ, గజ వాహనాలపై ఊరేగించనున్నారు. ఈసందర్భంగా  ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి మాట్లాడుతూ.. ఆరోగ్యం, పాడిపంటలు బావుండాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలన్నారు. సూర్యోపాసన ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం ఇత్యాది లభిస్తాయన్నారు. కార్యక్రమంలో దేవనాథ జీయరు స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి, ఆలయ ధర్మకర్తలు , నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, పృథ్వి నర్సారెడ్డి నరాల సుధాకర్, ప్రసాద్ రాజేశ్వర్, రమేష్ సాయిలు, భాస్కర్, మురళి, చిన్నయ్య, గంగారెడ్డి, రవి సురేష్, యజ్ఞాచార్యులు శిఖామణి  స్వామి , శ్రీకర్ కుమారాచార్యులు, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article