సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
కొనసాగుతున్న ఇందూరు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని సూర్య ప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం చంద్రప్రభ, గజ వాహనాలపై ఊరేగించనున్నారు. ఈసందర్భంగా ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి మాట్లాడుతూ.. ఆరోగ్యం, పాడిపంటలు బావుండాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలన్నారు. సూర్యోపాసన ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం ఇత్యాది లభిస్తాయన్నారు. కార్యక్రమంలో దేవనాథ జీయరు స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి, ఆలయ ధర్మకర్తలు...