29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిలువ నీడ లేక స్మశాన వాటికలో నివాసం

Must read

📰 Generate e-Paper Clip

. . . మన్యాపూర్ గ్రామంలో హృదయ విధాకర ఘటన

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మాన్యాపూర్ గ్రామంలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. మన్యాపూర్ గ్రామానికి చెందిన సింగారం సుజాతకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి మరొకరిని వివాహం చేసుకొని వెళ్లిపోగా సుజాత అమ్మమ్మ వారి ఇంట్లో తలదాచుకుంది. కాలక్రమేన కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి చెందిన నర్సింలు తో ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉన్నారు. ఆర్థిక స్థితిగతులు కారణంగా తమ స్వగ్రామమైన మన్యాపూర్ గ్రామానికి వచ్చినప్పటికిని తమకు సొంత ఇల్లు గాని స్థలం గాని లేకపోవడంతో సుమారు సంవత్సరం నుండి గ్రామంలోని స్మశాన వాటిక లో నిర్మించిన వైకుంఠధామంనందు నివసిస్తున్నారు. ప్రభుత్వం గానీ, ప్రభుత్వ అధికారులు గానీ స్పందించి తమకు కాసింత స్థలం చూయించినట్లయితే రేకుల షెడ్ అయిన లేదా గుడిసె నైనా వేసుకొని బ్రతుకుతామని ప్రతి ఒక్కరికి ప్రాధేయపడడం పలువురికి కంటతడి పెట్టిస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

 

Living in a shady spot or cemetery
Living in a shady spot or cemetery
Living in a shady spot or cemetery
Living in a shady spot or cemetery

More articles

Latest article