28.8 C
Hyderabad
Monday, August 3, 2026

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ గత ఏడు సంవత్సరాల నుండి వివిధ రకాల సేవ కార్యక్రమాలను చేస్తూ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం జూలై ఒకటవ తారీఖు నుండి కొత్త కాలం ప్రారంభమవుతుంది దీని కొరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా లయన్స్ కేవీ మోహన్, ఉపాధ్యక్షులుగా పత్తి రాము, ఇందూర్ చంద్రశేఖర్, కార్యదర్శిగా గుండురు ప్రశాంత్ గౌడ్, కోశాధికారిగా ఇమ్రాన్, జీఎస్టీ కోఆర్డినేటర్ గా లోగం నాగరాజ్, జిఎంటి కోఆర్డినేటర్ గా వడ్ల నరేష్, జిఎల్టి కోఆర్డినేటర్ గా తుక్కి మహేందర్, ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ గా రమేష్ యాదవ్, డైరెక్టర్లుగా లయన్స్ శివ శికారి, శ్యాంసుందర్ పహాడే, ప్రవీణ్ కుమార్ కారంగుల, రామ్ రాజ్ వాన్కర్, ఇబ్రహీం, పుట్టి సాగర్, మెబర్లుగా షేక్ తాహెర్, లింగాల శంకర్, సంతోష్ పటేల్, గాండ్ల మధు, కిరణ్ తోట్ల, గంగాధర్ గెంటిల, భాను పంతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశ అనంతరం ఎన్నికైన సభ్యులకు ఘనంగా సన్మానించారు.

Lions Club of Rudrur elects new executive committee

More articles

Latest article