. . . రోడ్డు భద్రత నిబంధనలపై విద్యార్థులకు అవగాహన
రుద్రూర్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నిబంధనలపై ఎస్సై సాయన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించుకుందాం.. ప్రాణాలను కాపాడుకుందామన్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగారాం, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ బాల గంగాధర్, ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

