23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

భార్య కొడుకు చేతిలో భర్త హతం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సహకరించిన కోడలు

 మోపాల్, బతుకమ్మ:

కుటుంబ తగాదాల నేపథ్యంలో  వ్యక్తి తన భార్య, కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో కోడలు కూడా భర్తతో పాటు అత్తకు సహాయం చేయడం గమనార్హం… మోపాల్ మండలం పోక్కిరి నాయక్ తాండలో  హరీ ( 50) అనే వ్యక్తి మంగళవారం రాత్రి భార్య, కోడుకుతో గొడవకు దిగారు. ముగ్గురి మధ్య జరిగిన వాగ్వివాదం లో హరి పై దాడి చేయడంతో అతడు అక్కడిక్కడే చనిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. డెడ్ బాడీ ని పోస్ట్ మార్టం కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనకు కారకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

More articles

Latest article