25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

డిచ్పల్లి, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమింపబడ్డ వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావును తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం  అధ్యక్షులు పంచరెడ్డి చరణ్, టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా  గత కొన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను వీసి దృష్టికి తీసుకెళ్ళారు.  నూతనంగా బాలికల వసతిగృహం నిర్మించాలని, అలాగే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, స్పోర్ట్స్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. నూతన కోర్సులను ప్రవేశ పెట్టడంతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా ప్రారంభించాలని, అలాగే విశ్వవిద్యాలయంలో వివిధ శాఖలలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుందని దానిపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధన విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం నిర్మించాలని, న్యాక్ గుర్తింపు కోసం విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దానికి తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం తరపున కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వీసీ తెలిపారు.

More articles

Latest article