వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు

డిచ్పల్లి, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమింపబడ్డ వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావును తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం  అధ్యక్షులు పంచరెడ్డి చరణ్, టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా  గత కొన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను వీసి దృష్టికి తీసుకెళ్ళారు.  నూతనంగా బాలికల వసతిగృహం నిర్మించాలని, అలాగే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, స్పోర్ట్స్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని కోరారు....