కోర్టుకు టీషర్ట్ వేసుకొచ్చిన లాయర్ కు జైలు శిక్ష

0 1,481

. ఆరు నెలల జైలు.. జరిమానా

. ప్రాక్టీస్ చేయకుండా నిషేధం

వెబ్ న్యూస్, బతుకమ్మ: కోర్టులకు టీషర్ట్ వేసుకుని వచ్చిన లాయర్ పై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టుకు టీషర్ట్ పై వచ్చిన లాయర్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తులు సూచించగా, వారిని గుండాలు అంటూ లాయర్ దూషించాడు. ఈ ఘటన అలహాబాద్ హై కోర్టు పరిధిలో 2021లో చోటు చేసుకోగా, న్యాయమూర్తులు గురువారం తీర్పు వెలువరించారు. అశోక్ పాండే అనే న్యాయవాది టీషర్ట్ వేసుకుని అలహాబాద్ హై కోర్టుకు వచ్చాడు. కోర్టు నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తులు అతడికి సూచించగా.. మీరు గుండాలు అంటూ దూషించాడు. దీంతో అశోక్ పాండేపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అప్పటికే 2017లో ఆయనపై రేండెళ్ల నిషేధం ఉండగా, 2021లో న్యాయమూర్తులను దూషించిన కేసులో ఆయన స్పందించలేదు. చివరకు గురువారం కేసు విచారణకు రాగా, న్యాయమూర్తులు వివేక్ చౌదరి, బీఆర్ సింగ్ బెంచ్ అశోక్ పాండేకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, ఆరు నెలల నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది.

Leave A Reply

Your email address will not be published.