28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిజి కాలేజీలో నాక్ బృందం  

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ:

ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో నాక్ బృందం పర్యటిస్తోంది. ఐదేళ్లకోసారి జరిగే పర్యటనలో భాగంగా నాలుగోసారి కళాశాలను సందర్శించారు.  గతంలో  బి గ్రేడ్ ఉన్న కాలేజిలో ఎ గ్రేడ్ సాదన కోసం ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డితోపాటు అధ్యాపక బృందం అహర్నిశలు కృషి చేస్తూ వస్తోంది. ధీనిలో భాగంగానే న్యాక్ బృందం 6,7 తేదిలలో జిజి కాలేజిలో పర్యటిస్తోంది. బృందం తిలకించేందుకు గాను స్టాల్స్ ఏర్పాటు చేసారు. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, క్రీడలు, చరిత్ర, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం, టిఎస్ఐసిఈ  ప్లేస్ మెంట్, ఎంటర్ ప్రేన్యునల్ డెవలప్మెంట్, జిజ్ఞ స్టడీ ప్రాజెక్ట్ సెల్, కంప్యూటర్ సైన్సు విభాగం స్టాల్స్ నెలకొల్పి వారు సాదించిన విజయాలను పొందుపరిచారు. పర్యటనకు వచ్చిన బృందం ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ప్రశ్నల వర్షాన్ని యాజమాన్యంపై కురిపిస్తోంది. వీటన్నింటికి వచ్చిన వారికీ అర్థమయ్యేలా సానుకూలంగా వివరించి చెబుతున్నారు. నాక్ బృందంలో చైర్ పర్సన్ రాకేష్ కుమార్ గుప్తా, సభ్యులు హరిచంద్ర రమణే, అనిరుద్ భార్గవన్ ఉన్నారు.

Knock Team at GG College

More articles

Latest article