27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒకరికి ఏడేళ్ళ కఠిన జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వేయి రూపాయల కోసం వ్యక్తిని కత్తితో పోడిచి చంపిన నిందితుడికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల గురువారం తీర్పు వెలువరించారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు…కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన సమీఉద్దీన్, వసిమోద్దీన్ అన్నదమ్ముల కొడుకులు. ఇద్దరు పూల దుకాణంలో పనిచేసేవారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలు విక్రయించే ముస్తఫా ఖాన్ దగ్గర పనిచేస్తుండే వాడు వసిముద్దీన్ తన ఆర్థిక అవసరాలకు యజామాని దగ్గర దాదాపు యాభైవెల రూపాయలకు పైగా అప్పుగా తీసుకున్నాడు.బాకీ తీర్చమని ఖాన్ ఒత్తిడి చేయసాగాడు. ఇది భరించలేని వసిమోద్దీన్ తన తల్లిపేరున బాన్సువాడ బంధన్ బ్యాంక్ నందు ముప్పై వేలు తన చిన్నమ్మ పేరున మరో ముప్పై వేలు అప్పుగా తీసుకుని ఖాన్ కు రూ.45వేలు అప్పు చెల్లిద్దామని నిజామాబాద్ చేరుకున్నాక నేనె ముస్తఫా ఖాన్ కు డబ్బులు చెల్లించి వస్తానని షేక్ సమీఉద్దీన్ బైక్ పై వెళ్లి తిరిగి వచ్చాడు. 24ఫిబ్రవరి 2022 న ఇద్దరు కాలూరు బైపాస్ రోడ్డులో గల విన్నూ వైన్స్ లో వారి ప్రెండ్ అలీమ్ తో కలిసి మద్యం సేవించారు. ముగ్గురు బైక్ పై వస్తుండగా వసిమోద్దీన్, తాను అప్పు తీసుకున్న పులదుకాణం యజమాని ఖాన్ కు ఫోన్ చేసి సమీఉద్దీన్ ఎన్ని రూపాయలు చెల్లించాడు అని అడగడంతో 45 వేలు  మాత్రమే చెల్లించాడని తెలపడంతో బ్యాంక్ నందు అప్పు చేసి రూపాయలు తెస్తే వేయి తక్కువగా ఎందుకు కట్టావు అని ఘర్షణ పడ్డాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగి ఎప్పుడు తన వద్ద ఉంచుకునే కత్తితో షేక్ సమీఉద్దీన్ కనతలో, కడుపులో ఇతర శరీర భాగాలలో బలంగా పొడిచి గాయపర్చడంతో తీవ్రరక్తస్రావం అయి అక్కడిక్కడే మృతి చెందాడనే నేర అభియోగాలు న్యాయస్థానం నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయి మహమ్మద్ వసిమోద్దీన్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెలించని ఎడల అదనంగా ఆరు నెలల సాదారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు లో పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను రువుమాపే ప్రయత్నం చేసినందున మూడేళ్ళ కఠిన శిక్ష తోపాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని ఎడల అదనంగా మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని సెషన్స్ జడ్జి సునీత తమ తీరులో వెల్లడించారు.

More articles

Latest article