28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం శివనామస్మరణ మధ్య శుక్రవారం తెరుచుకుంది. వేలాది మంది భక్తుల  ప్రార్థనలు, భజనల మధ్య ప్రధాన అర్చకుడు ఆలయ ద్వారాలు తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కేదారేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని పూలతో అందంగా అలకరించారు. ఆలయాన్ని  తెరిచే సమయంలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. కాగా, ఉత్తరా ఖండ్ లోని గంగోత్రి, యుమునోత్రి ఆలయ ద్వారాలను బుధవారం తెరిచారు. ఆదివారం బద్రీనాధ్ ఆలయ ద్వారాలు తెరవనున్నారు.

More articles

Latest article