లండన్ నుంచి హైదరాబాద్ కు రాక
హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్‌లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో జూలియా మోర్లి సమీక్షించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.