- సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపు
సిరికొండ, బతుకమ్మ : మే డే స్ఫూర్తితో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పి కొట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు.గురువారం మండలం లోని గడ్కోల్ గ్రామంలో బస్టాండ్ వద్ద గల గద్దె వద్ద ఎర్ర జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కార్మిక హక్కుల కోసం ,కార్మికుల పని గంటల తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం కోసం సాగిన పోరాటంలో చిందిన ఎర్రనీ రక్తమే ఈ ఎర్రజెండా అని అన్నారు.ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి కొట్లాడీ తెచ్చుకున్న ఈ హక్కులను మనం కాపాడుకోవాలని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాస్తున్నది ,కార్మిక చట్టాలను ఆధాని, అంబానీ, లాంటి బడాబడా వ్యాపారవేత్తల వద్ద నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప అనే నినాదాన్ని మనం గోతెత్తి చాటాలాన్నారు. మన హక్కుల సాధన కోసం మళ్ళీ మన ఉద్యమించాలని, కార్మిక హక్కులను విస్మరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి, గద్దె దించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టీ స్వేచ్ఛగా బతుకుతున్న ఈ మనుషుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి మారణ హోమం సృష్టించడం అప్రజస్వామికమైన చర్య అని అన్నారు. ఇది మతోన్మాదం, దీనిని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ గడ్కోల్ గ్రామ పార్టీ కార్యదర్శి మల్కి లింబాద్రి,మండల నాయకులు , బి. కిశోర్ కిరణ్, రాంజీ, ఎస్. కిశోర్,బాల్ రెడ్డి, అనిస్, నారగౌడ్, నిమ్మల. రాములు, కుమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
