. . . వైస్ చైర్‌పర్సన్‌గా రేష్మా బేగం ఎజాజ్
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపల్ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెరో 3 స్థానాలు గెలుచుకున్నాయి. అలాగే ఎంఐఎం పార్టీ ఒక స్థానం సాధించగా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ బాలరాజ్, వైస్ చైర్‌పర్సన్‌గా రేష్మా బేగం ఎజాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

