30.9 C
Hyderabad
Monday, August 3, 2026

శ్యాంప్రసాద్  ముఖర్జీ బలిదానంతోనే కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమైంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపి ధర్మపురి అర్వింద్

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

శ్యాంప్రసాద్  ముఖర్జీ  అత్మ బలిదానంతోనే కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమైందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ  బలిదాన్ దినోత్సవం సందర్భంగా సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించి, కాకతీయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఎంపి ధర్మపురి అర్వింద్ మొక్కను నాటారు. ఈ సంధర్బంగా ఎంపి మాట్లాడుతు అనాడు అరాచక వాదులు  కాశ్మీర్ లో అడ్డుపడితే లాల్ చౌక్ జాతీయ జండాను ఎగురవేసి అత్మబలిదానం చేశారని గుర్తు చేశారు. బిజేపి నాయకులు, కార్యకర్తలు శ్యాంప్రసాద్ ముఖర్జీ అశయాల మేరకు కాశ్మీర్ ను భారత్  దే అని అంతర్జాతీయ సమాజం గుర్తించేలా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు  ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా , జాతీయ పసుపు బోర్డు  చైర్మన్ పల్లె గంగారెడ్డి , జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ,  వడ్డీ మోహన్ రెడ్డి , స్రవంతి రెడ్డి , కాకతీయ విద్యాసంస్థల అధినేత రజనీకాంత్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kashmir became part of India with the martyrdom of Shyam Prasad Mukherjee.

More articles

Latest article