27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కల్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం లోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు అందజేయడం జరిగిందని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి అన్నారు. తమ ఎమ్మెల్యే మదన్ మోహన్ పేదోళ్లకు ఎలాంటి భారం పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా గడప గడపకు వెళ్లి మండల నాయకులు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయాలని తెలిపారని అన్నారు. ఆ మేరకు ప్రతి గ్రామానికి వెళ్లి చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడంతో ఎంతో ఆనందంగా భావించి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు సల్మాన్, సీనియర్ ఉపాధ్యక్షులు బీమరి శ్యామయ్య, శ్రీధర్, బన్సీలాల్, ఎయం సి డైరెక్టర్లు, సాయగౌడ్, బాలరాజు,అధికారులు ఆర్ ఐ లక్ష్మయ్య, స్టాఫ్, మరియు సమన్వయ కమిటీ సభ్యులు సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్లు బీరయ్య, లక్ష్మన్,బిసి సెల్ అధ్యక్షులు స్వామి ,మండల సీనియర్ నాయకులు సారిలాల్,బలెందర్, ప్రభాకర్,గ్రామాల అధ్యక్షులు, ఏనుగుల సాయిలు,నరేందర్ గౌడ్, అకిటి శ్రీనివాస్ రెడ్డి,యూత్ ఉప అధ్యక్షులు నరేష్ గౌడ్ రమేష్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Kalyana Lakshmi, distribution of CM Relief Fund cheques

More articles

Latest article