29.5 C
Hyderabad

నవోదయ ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పటిష్ఠంగా చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం లైన్ డిపార్ట్మెంట్స్ తో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీన నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు జిల్లాలో 14 సెంటర్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సెంటర్ కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు.  అడిషనల్ కలెక్టర్ లైన్ డిపార్ట్మెంట్స్ అయినా ఎలక్ట్రిటిసిటీ, మెడికల్, పోలీస్ వివిధ డిపార్ట్మెంట్స్ తో సమావేశం నిర్వహించి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

More articles

Latest article