. . . నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహిళా విద్య కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా శనివారం కాంగ్రెస్ భవన్ లో పూలే చిత్రపటానికి, అలాగే వినాయక నగర్ లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక విప్లవ పితామహుడని, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి 1848లో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు.

సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు.మహిళలు విద్యావంతులు కాకుండా సమాజం అభివృద్ధి చెందదని ఫూలే బలంగా విశ్వసించారన్నారు. వారిని సామాజిక సంకెళ్ల నుండి విముక్తి చేయడానికి విద్యే మార్గమని చాటి చెప్పారన్నారు.1873లో సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి కుల రహిత, అణచివేత లేని సమాజ స్థాపనకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,డిసిసి కోశాధికారి భక్తవత్సలం, డిసిసి ఉపాధ్యక్షులు కౌడపు శరత్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఎఐసిసి కోఆర్డినేటర్ గన్ రాజ్, కార్పొరేటర్ ప్రవీణ్, కార్పొరేటర్ మనోహర్,వినయ్, లవంగ ప్రమోద్, సంగం సాయిలు, దాత్రిక భాస్కర్,కోనేరు సాయికుమార్,ముల్గురి గణేష్, స్వప్న, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
