27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఎటిఎం మెషిన్ ఎత్తుకెళ్లిన ఆగంతకులు

Must read

📰 Generate e-Paper Clip

 

 ఎల్లారెడ్డి పేట, బతుకమ్మ:

ఏటీఎం చోరీకి యత్నించారు అగంతకులు సాధ్యం కాకపోవడంతో ఎకంగా ఎటిఎం మెషిన్ ని చోరీ చేశారు. ఈ సంఘటన  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్ బి ఐ ఏటీఎం లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు.అయితే ఎటిఎం తెరువడం సాధ్యం కాకపోవడంతో ఎటిఎం మెషిన్ ని పెకిలించి తీసుకుపోయారు. పకడ్బందిగా పథకం ప్రకారం ఏటీఎం ల చోరీలకు పాల్పడే ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎటిఎం మెషిన్ చోరి జరిగినప్పుడు అలారం మొగక పోవడం, సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఆగంతకులు సులువుగా మెషిన్ ఎత్తుకెళ్లారు అని చెప్పాలి. ఎటిఎం మెషిన్ లో చోరి జరగకముందే రూ.8 లక్షల నగదు నిల్వ ఉందని తెలిసింది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణుల ద్వారా వేలిముద్రలు అనవాళ్లు సేకరించారు. గతంలో ఎటిఎం మెషిన్ ని ఎత్తుకెళ్లిన ముఠాల పై అనుమానంతో సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పొరుగు జిల్లాల పోలీసులు అప్రమత్తం చేశారు. నలుగురు ఐదుగురు సభ్యులు కలిగిన గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎత్తుకెళ్లిన ఎటిఎం మెషిన్ ను తెరిచి నగదు చోరీ చేసి ఎక్కడో పారేసి ఉండే అవకాశం ఉంది.  వాహనాల తనిఖీలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

Robbers steal ATM machine
Robbers steal ATM machine

More articles

Latest article