ఆలూర్, బతుకమ్మ: మహిళలకు విద్యనందించేందుకు ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని ఉమ్మడి ఆర్మూర్ మండల మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య అన్నారు. ఆలూర్ మండలం మచ్చర్లలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ, కుల సంఘం పెద్దలు, యువకులు బీఎస్పీనాయకులు కాంగ్రెస్ నాయకులు మంతెన సంజీవ్, మాజీ ఎంపీటీసీ మార్ల ప్రభాకర్, ప్రసాద్, కాలూరు చిన్న ఉష, ఉద్గిరి మధు, సమీర్, పచ్చుక రాములు, నవీన్, రాజు, జీవన్, చిన్నా గంగారాం తదితరులు పాల్గొన్నారు.
