హైదరాబాద్, బతుకమ్మ : మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెక్లెస్ రోడ్డులోని లేక్ ప్యూ పార్క్ లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. స్థల సర్వే చేసి పూర్తి స్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా డిజైన్ చేయాలని సూచించారు.
