28.8 C
Hyderabad
Monday, August 3, 2026

భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రైతు నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

 

నిజాంసాగర్, బతుకమ్మ : మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని  రైతు నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాంసాగర్ ఎంపీడీఓ ఆఫీస్ లో  బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన రైతుల తరఫున మాట్లాడారు. రైతుల తరఫున వారి సమస్యలను, కొన్ని సూచనలను సబ్  కలెక్టర్ విన్నవించారు. అందులో భాగంగా ఏదైతే ఈ ప్రాజెక్టు లో వడ్డేపల్లి గ్రామానికి, ఐదు గ్రామాలకు ప్రతిపాదించిన పైపులైన్ సంబంధించి 2593 ఎకరాలకు  చెరువులను నింపే ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, దానికి సంబంధించిన పనులను తొందరగా ప్రారంభించాలని కోరారు. ప్రాజెక్టు మొదటి విడతలో 14,000 ఎకరాలకు నీరందించే పైప్ లైన్, ప్రాజెక్ట్ నుండి  దాదాపు 9 కిలోమీటర్  పరిధిలో ఉన్న  రైతులందరికీ ఒకేసారి భూ సేకరణ చేసే విధంగా, భూమి కోల్పోయిన రైతులకు గతంలో ఈ ప్రాజెక్టులో ఇచ్చిన పరిహారం ఎకరాకు 17 లక్షలకు కాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఆ యొక్క పరిహారం సరిపోదని ఎకరాకు 30 లక్షల పరిహారం చెల్లించాలని  అన్నారు. రైతులందరికీ న్యాయం చేసే విధంగా చూడాలని సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు హనుమంత్ రెడ్డి, మచ్చా రవీందర్, సాయిలు పండరి, సాయి రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Justice should be done to farmers who are losing their lands.

More articles

Latest article