ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుల వినతి
బతుకమ్మ,మద్నూర్: గడిచిన 50 సంవత్సరాల కాలంగా జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదని ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మి కాంతారావు ఉన్నత చదువులు చదివిన వ్యక్తని, వెనుకబడ్డ జుక్కల్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అభివృద్ధి ప్రదాతకు మంత్రి పదవి ఇవ్వాలని మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నవించారు. సోమవారం మద్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వెనుకబడ్డ జుక్కల్ అభివృద్ధికి కృషి మరింతగా జరగాలంటే ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలం నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదని అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు వట్నాల రమేష్, యువ నాయకులు అమూల్, కర్ల సాయిలు, తూమ్ రాములు, పాల్గొన్నారు.
