కామారెడ్డి , బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారు చేస్తున్న మహిళను గతంలో బైండోవర్ చేసిన మళ్ళీ నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్నందుకు తహసీల్ధార్ రూ.10 వేల జరిమానా విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తాండకు చెందిన లావుడ్యలాలీ గతంలో నాటుసారా తయారు చేసి విక్రయించినందుకు బైండోవర్ చేశారు. తిరిగి నాటుసారా విక్రయాలు చేస్తున్నందుకు బైండోవర్ ను ఉల్లంఘిచినందుకు మాచారెడ్డి తహసీల్ధార్ లావుడ్యలాలీకి రూ.10 వేల జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు.
