27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కబ్జా చెరలో జెన్కో భూమి 

Must read

📰 Generate e-Paper Clip

  • 30 ఎకరాలకు సర్వే పూర్తి
  • 12 ఎకరాలు కబ్జాకు గురైందా.. అధికారులు కుమ్మక్కయ్యారా..

నిజాంసాగర్, బతుకమ్మ:  దేశంలో తొలి రాతి కట్టడం గా ప్రసిద్ధిగాంచి.. విద్యుత్ ఉత్పత్తిని జరిపిన నిజాం సాగర్ ప్రాజెక్టు భూముల పై ఆక్రమార్కుల కన్నుపడింది.  నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జల విద్యుత్ ఉత్పత్తి కోసం హసన్ పల్లి గ్రామ శివారులో జెన్కో కు 42 ఎకరాలు కేటాయించారు. ప్రాజెక్టు ప్రాంతంలో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఉద్యోగుల నివాసాల కోసం, ట్రాన్స్కో సబ్ స్టేషన్ కేటాయించగా మిగతా దీనిని కొందరు రెవెన్యూ అధికారుల అండదడలతో కబ్జాకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. గత నెల 27న తెలంగాణ రాష్ట్ర జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిశీలించి ఆక్రమణలు నిజమని తేల్చారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద జెన్కోకు సంబంధించిన 42 ఎకరాల భూమి రికార్డులలో ఉంది. 42 ఎకరాలలో జల విద్యుత్ కేంద్రం ట్రాన్స్కో సబ్ స్టేషన్ లు ఎన్ని ఎకరాలు ఉంది మరిన్ని ఎకరాలు ఆక్రమించుకున్నట్టు గుర్తించారు.

Jenko's land in captivity

ఈ విషయంలో తాసిల్దార్ సర్వే చేయించి జెన్కో భూమి ఎంత ఉందో తేల్చి చెలప్పాల్సి ఉంది. జెన్కో అధికారులు ఫిర్యాదులు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేయర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జెన్ కు సంబంధించిన ఎన్ని ఎకరాల భూమి ఉందని అక్టోబర్ నెలలో సర్వేయర్రు శ్రీకాంత్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. జెన్కో అధికారులు చూయించిన దగ్గర మాత్రమే సర్వే చేసినట్లు సర్వేలో 30 ఎకరాలు మాత్రమే సర్వే నిర్వహించినట్లు సర్వేయర్ శ్రీకాంత్ తెలిపారు. జెన్కోకు సంబంధించిన ఇంకా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో రెవెన్యూ అధికారులకు జెన్కో అధికారులకు మాత్రం తెలియడం లేదు. జెన్కో అధికారులకు అడుగుతే 2008 భూభారతి సర్వే ప్రకారం 30 ఎకరాలు మాత్రమే సర్వే చేసినట్లు తెలుస్తుంది. జెన్ కో కు సంబంధించిన ఇంకా 12 ఎకరాల ప్రభుత్వము ఎక్కడ ఉందో జెన్కో అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా తెలియకపోవడం ఎంత విడ్డూరం. జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ప్రభుత్వం ఇంత భూమి అని కేటాయించినట్లు గాని ఏ రికార్డుకు సంబంధించింది కానీ జెన్కో వారి వద్ద లేకపోవడం అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా రెవెన్యూ అధికారుల వద్ద జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ఎంత భూమి ఇచ్చారు అన్నది రెవెన్యూ అధికారుల వద్ద కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడం అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పనితీరు తో జెన్కోకు సంబంధించిన భూమి 12 ఎకరాలు సర్వే చేపడతారో లేక వదిలేస్తారో వేచి చూడాల్సిందే..

Jenko's land in captivity

More articles

Latest article