25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హన్మాజీపేట పిహెచ్సీలో జన ఔషధి దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జన ఔషధ దినోత్సవాన్ని నిర్వహించినట్టు మెడికల్ ఆఫీసర్ డా.ఖాసీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది అన్నారు. ఎన్నో రకాల వ్యాధులను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఔషధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article