. . . దేశాన్ని అప్పుల పాలు చేసింది మోడీ ప్రభుత్వమే
. . . ఎఐకెఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు
మోపాల్, బతుకమ్మ :
భారతదేశం వ్యవసాయ దేశమంటూ, రైతే రాజు అంటూ, రైతు వ్యతిరేక విధానాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఎఐకెఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు అన్నారు. శనివారం మోపాల్ మండల కేంద్రంలో 11 వ జిల్లా మహా సభలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సుత్తి కొడవలి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ అరుణోదయ కళాకారులు పాటలు పాడారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎండల తీవ్రత 50% ఉష్ణోగ్రత ఉన్న, తక్కువగా ప్రకటించి, మరో దిక్కు మే 24 వరకు బయటకు వెళ్ళద్దని ప్రభుత్వం వాతావరణం కేంద్రం ద్వారా హెచ్చరిక చేసి తన బాధ్యతను విస్మరించిందని ఆయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆత్మహత్యలు, ఆకలి చావులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 156 దేశాల్లో మన దేశం ఆకలిలో 106 వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. 56 శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం లేదని అనేక ఫుడ్ కార్పొరేషన్ సంస్థలు ప్రకటించాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాల తిరిగి తేవడానికి కుట్రలు చేస్తుందని ఆయనన్నారు. మోడీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత 185 లక్షల కోట్లు అప్పు చేసిందని, గత అప్పు కలిపితే 239 కోట్లు చేరిందని ఆయన తెలిపారు. విద్యా, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించలేదని, రైతులను ఆదుకోలేదనీ, ఉపాధి కాపాడలేదని ఆయనన్నారు. ప్రపంచ బ్యాంకు సూచించిన ప్రకారం, ఒక దేశంలో ఒక పౌరుని ఆదాయం 14 లక్షలు ఉన్నప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించాలని ప్రకటించిందని ఆయన తెలిపారు. ఇవాళ భారతదేశం పరిస్థితి అంధకారంగా ఉందని, అయినా మోడీ సర్కార్ భారతదేశం వెలిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. మోడీ ఫాసిస్టు విధానాలు వ్యతిరేకిస్తే, తప్పుడు కేసులు బనాయించి నిర్బంధిస్తుందని తెలిపారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం సి2+50 శాతం మద్దతు ధర కట్టించి, ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడిన రైతన్నలను బతుకులను ప్రభుత్వాలు ఆగం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం ఢిల్లీలో 500 సంఘాలు ఎస్కేయం పేరుతో సంవత్సరం కాలం ఆందోళన చేస్తే, మోడీ సర్కార్ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్న, హక్కులను అమలు చేయలేదని ఆయన అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రైతు కూలీలను ఏకం చేసి రైతు వ్యతిరేక పాలకులను ఓడించాల్సిన బాధ్యత ఏఐకేఎంఎస్ పై ఉందని ఆయన తెలిపారు. రైతు కూలీలను ఐక్యం చేసి ఉద్యమాలను తీవ్రం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సీనియర్ నాయకులు ఆకుల పాపయ్య మాట్లాడుతూ జిల్లాలో రైతాంగ సమస్యలపై, నిజాం సాగర్ ఆయకట్టు రక్షణకై, ప్రభుత్వ మిగులు భూములు పంచాలని, సాగునీటి సౌకర్యం కల్పించాలని, చెక్కర ఫ్యాక్టరీని కాపాడాలని, తడిసిన ధాన్యానికి సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పోరాడిన చరిత్ర మన సంఘానికి ఉందని ఆయన తెలిపారు. మంటలు తీయడంలో అంకాపూర్ రాష్ట్రానికి ఆదర్శంగా చేసిందని తెలిపారు. ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు నరసయ్య, అగ్గు ఎర్రన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, పి వైఎల్ జిల్లా నాయకులు బండమీది నరసయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, శివకుమార్, హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి భారతి, అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్, గోపాల్ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పరువ య్య, దేవన్న, చిన్నయ్య, పోషన్న, బన్సీ, శ్రీనివాస్ రెడ్డి, దేవస్వామి, గంగాధర్, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

