. . . బోధన్ పోలీస్ స్టేషన్ లో 32 సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ
బోధన్, బతుకమ్మ :
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.

శనివారం బోధన్ పోలీస్ స్టేషన్ కార్యాలయం లో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 32 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ 5 చొప్పున కెమెరా లు వారి వార్డు భద్రత కోసం పెట్టాలని చెప్పారు. ఇది వారి భాద్యత గా తీసుకోవాలని, నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, బోధన్ టౌన్ లో 32 కెమెరాలు పెట్టి సహకరించిన కదం ప్రమోద్ ను సీపీ సన్మానించారు.

ఈ సందర్భంగా బోధన్ పట్టణంలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం వాల్ పెయింట్స్ వేస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నటువంటి సమీర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, బోధన్ ఏసిపి శ్రీనివాస్, బోధన్ ఎస్.హెచ్.ఓ వెంకట నారాయణ, రుద్రూర్ సి.ఐ కృష్ణ, రూరల్ ఎస్.ఐ మచ్చేందేర్, మనోజ్ కుమార్ ఎస్.ఐ బోధన్, మహేష్ ఎస్. ఐ ట్రాఫిక్, వైస్ చెర్మన్ ఇలియాస్, బంగారం దుకాణల ప్రెసిడెంట్ కధం ప్రమోద్, కౌన్సిలర్స్, ప్రజలు పాల్గొన్నారు.

