27.3 C
Hyderabad
Friday, July 31, 2026

డాక్టర్ బాపురెడ్డికి నివాళులు అర్పించిన ఆఫీసర్ క్లబ్ కమిటీ సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ వైద్యులు, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ జె.బాపురెడ్డి మృతి జిల్లాకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, నిజామాబాద్ అప్పీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హంధాన్ అన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన సంతాప సమావేశంలో బాపురెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. వైద్యుడుగా ఎంతోమందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు పోసి జిల్లా ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. తన దగ్గరకు వచ్చిన రోగులకు, సామాన్య ప్రజలకు తెలంగాణ భావజాలం నింపిన వ్యక్తి అని ఆయన తెలిపారు. సమావేశంలో క్లబ్ కార్యదర్శి చిల్వేరి సత్య నారాయణ, కోశాధికారి గంగా కిషన్, సభ్యులు ఈగ గంగారెడ్డి, దేవిదాస్, రాంరెడ్డి, భూపాల్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి,శరత్, ఏటీఎస్ శ్రీనివాస్, కృష్ణారావు, రవిరాజ్,రమణారెడ్డి, గంగాధర్ గౌడ్, బోస్లె, తదితరులు పాల్గొని బాపురెడ్డి క్లబ్ కు చేసిన సేవలను కొనియాడారు. అంతకు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

More articles

Latest article