28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలలో వివిధ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బాంని గ్రామానికి  చెందిన షేక్ రఫీక్, షేక్ ఖాదర్, షేక్ ఖయ్యూం, షేక్ అజ్జూ, మహబూబాబాద్ టౌన్ లోని బాబా గుట్ట కాలనీకి చెందిన బండారి అశోక్ ఒక టీంగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెల 31న చిన్నమల్లారెడ్డి శివారులోని ఓల్డ్ ఎన్ హెచ్ 7రోడ్డు పక్కన గల ఆటో ఎలక్ట్రికల్ షాపులో రేకులను తొలగించి కారు, వెహికల్ స్కానర్స్, బ్యాటరీలు, ఏసీ ప్యానెల్, సీసీ టీవీ హార్డ్ డిస్క్ లను దొంగిలించారు. షాపు యజమాని దేవుని పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల దేవుని పల్లి పోలీస్ స్టేషన్, కామారెడ్డి పట్టణ పీఎస్ పరిధిలో జరిగిన దొంగతనాల నేరస్తులను పట్టుకోవడానికి కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, దేవుని పల్లి ఎస్ఐలు రంజిత్, భువనేశ్వర్, సీసీఎస్ ఎస్ఐ ఉస్మాన్ లతో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ పుటేజీ, సాంకేతిక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. శనివారం నర్సన్నపల్లి కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు జిల్లాలోని దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివ నగర్, భిక్కనూర్ పీఎస్ పరిధిలో చేసిన 15దొంగతనాలను ఒప్పుకున్నారు. నిజామాబాద్ లోని రెంజల్, నిర్మల్ జిల్లాలోని బాసర పోలీస్ స్టేషన్ లపరిధిలో నేరాలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక కారు, 3బైకులు, 2 స్పానర్లు, 3 ఇనుప రాడ్డులు, ఒక సుత్తే, స్క్రూ డ్రైవర్ టైప్ వెపన్, డీజిల్ క్యాన్, వాహన డయాగ్నస్టిక్ స్కానర్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ టీంను జిల్లా ఎస్పీ అభినందించారు.

Interstate robbery gang arrested

More articles

Latest article