25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నివాసంలో కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యసాహసాలు, కృషి ప్రధాన పాత్ర పోషించాయని అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా కొత్త దశ ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందని, యువతకు ఆశాకిరణంగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ చైర్మన్ అబ్దుల్ ఖాళీక్, మాజీ చైర్మన్ జంగం గంగాధర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ బిన్ మోసిన్,మైనారిటీ నాయకులు అజీమ్, శాహాబ్, వహాబ్,ఎజాజ్, మాజీ కౌన్సిలర్ కిరణ్, యువ నాయకులు గౌస్, హజారే శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article