417 విద్యార్థులు గైర్హాజరు
ఇంటర్ బోర్డు స్క్వాడ్ బృందాల తనిఖీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 417 మంది విద్యార్థులు గైర్హాజయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 16,297 మంది విద్యార్థులకు గాను15,880 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 97.4 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. ఇంటర్ బోర్డు పరీక్షల విభాగం నుండి విశ్వేశ్వర్ బృందం పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 51 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్, వినాయకనగర్ ఎస్సార్ జూనియర్ కళాశాలలు, డిచ్పల్లి మోడల్ జూనియర్ కళాశాల, డిచ్చిపెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిచ్చిపల్లి లోని ఎస్పిఆర్ జూనియర్ కళాశాలను, ధర్మారంలోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల, వెక్టార్ జూనియర్ కళాశాల లను తనిఖీ చేసి సమీక్షించారు. హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో 7 జూనియర్ కళాశాలలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుదిన్ అస్లాం, కనకమహాలక్ష్మి 9 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నర్సయ్య, బాలాజీ యమున బృందం 20 పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్కాడ్ బృందాలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ మూడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.
