పోతంగల్, బతుకమ్మ : ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ పై సుంకిని గ్రామస్తులు తహసీల్దార్ గంగాధర్ కు ఫిర్యాదు చేశారు. సుంకిని గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పేదల ఇంటి స్థలాల కోసం కేటాయించి పట్టాలు పంపిణి చేశారు. అక్కడ నీటి, రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో కొంత మంది నివాసం ఉండగా మరికొంత మంది వెళ్లలేక పోవడంతో గత ప్రభుత్వ హయాంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి లేవుట్ చేసి పంపిణి చేయాలని అప్పటి ఆర్డిఓ, తహసీల్దార్ లకు ఆదేశించారు. ప్రభుత్వం మారడంతో లేవుట్ పనులు పెండింగ్ లో ఉండగా ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ , అనుచరులతో కలిసి ప్రభుత్వ భూమి కబ్జా చేశారనీ ఇదేమిటి అని ప్రశ్నింస్తే మీకు దిక్కున చోట చెప్పుకో అని బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. కబ్జా లను తొలగించి నిరుపేదలకు భూమి కేటాయించాలని తహసీల్దార్ గంగాధర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రెండు రోజులలో సబ్ కలెక్టర్, కలెక్టర్ ను సైతం కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాయిలు, మాజీ సర్పంచ్, సగతూరాం, దొండయ్య,విట్టల్, అశోక్, సునీల్, ధీరజ్, దురుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
