. . . బిర్యానీలో రంగుల వాడకంపై పిర్యాదులు
. . . జిల్లా కేంద్రంలోని ప్రముఖ హోటల్ లలో సోదాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్టార్ హోటళ్లతో పాటు ప్రముఖ హోటల్ లో ఫుడ్ సేప్టీ అధికారులు తనీఖీలు నిర్వహించారు. శనివారం పుడ్ సెప్టి కమీషనర్ అదేశాల మేరకు ఫుడ్ సెప్టీ టాస్క్ ఫోర్స్ అధికారి జోతిర్మయి అధ్వర్యంలో సోదాలను నిర్వహించారు. ఐదు టీంల అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిఖీల్ సాయి హోటల్, శాతవాహన, లహరీ ఇంటర్ నేషనల్ హోటల్స తో పాటు ప్రముఖ హోటళ్లలో కిచేన్ లలో తనిఖీలను చెపట్టారు. ప్రధానంగా బిర్యాని వంటలో రంగుల వాడకంపై పిర్యాదులు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రముఖంగా బిర్యానీల ఫేమస్ హోటల్స్ తో పాటు బొదన్ రోడ్డులోని హోటల్ లో సోదాలను చెపట్టారు. ఈ మేరకు రాత్రి వరకు తనిఖీలు చేసి కమీషనర్ కు నివేధిక ఇస్తామని అధికారులు తెలిపారు. నగరంలో ఫుడ్ సెప్టి అధికారుల రాకతో రంగు, రుచి కోసం రసాయినాలను పుడ్ లో కలుపుతున్న హోటల్ నిర్వహకులలో దడ మొదలైంది. ఎక్కడ కేసులు నమోదు అవుతాయో లేక జరిమానా వేస్తారో అని భయపడిపోయారు.