కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం

0 1,064
  • రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
  • కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో శనివారం ఇందల్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకర సంగం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో నమ్మి మోసపోవద్దని తెలిపారు. నేరుగా కొనుగోలు కేంద్రానికి వరి దాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు చేసుకునే విధంగా చూసుకోవాలని తెలిపారు.కొనుగోలు కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు ఒక కోటి 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడం జరిగిందన్నారు.అన్న వరి ధాన్యం కి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతుల కోసం గతంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందన్నరు. జనవరి నుండి రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.రైతులకు ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్య కార్డులను డిజిటల్ కార్డుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించే దిశగా ముందుకెళ్తుందని ఇందిరమ్మ కమిటీలను గ్రామాలలో వేయడం జరిగిందన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల రైతుల నష్టపోయారని పేర్కొన్నారు.కేటీఆర్,హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తరచుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక వివిధ రకాలుగా మతిస్థిమితం కోల్పోయి పలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆరోపణలను ప్రజలు,రైతులు అందరు గమనిస్తున్నారు,మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో ఉంటూ హరీష్ రావు,కేటీఆర్ లతో పిచ్చిపిచ్చిగా మాట్లాడిస్తున్నారన్నారు,నేడు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందన్నారు. చివరగా బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ పార్టీగా మారనుందాన్నారు. ఎటు గత్యంతరం లేక బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు. బిజెపి పార్టీ గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి 600 రైతులను హతమార్చిన ఘనత బిజెపి పార్టీ దేనని అన్నారు.వరి మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 2320, కామన్ వర్ధాన్యానికి 2300 ఇవ్వనున్నట్లు తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి కడతా లేకుండా చూసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలలో 80 శాతం పూర్తయిందని మిగతా 20 శాతాన్ని కూడా అతి త్వరలోనే అమలుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సంతోష్ రెడ్డి, గంగారెడ్డి,ఎల్ఐసి గంగాధర్,గోపి,అరిపెల్లి దశరథ్, గట్టు కడారి, మాజీ ఎంపీపీ ముత్తన్న,మోతిలాల్,పరమేష్,గంగారెడ్డి, ,ఏఈఓ ప్రకాష్ గౌడ్, సీఈఓ రతన్, కిషన్, రవి,సుధాకర్, వసంత్, కె.పి గంగాధర్,నారాయణ, సీనియర్ నాయకులు కార్యకర్తలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.