24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలo  ధర్మోరా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునిల్  ఆదేశాల మేరకు లబ్ధిదారులకు   బుధవారం ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి దేవేందర్ అన్నారు. ధర్మోరా గ్రామంలో 20 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇల్లు మంజూరు  పత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు శ్యాము గౌడ్, అనిల్, మహేష్, నరేష్, రాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి కారోబార్ సాయన్న గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article