- ఎమ్మార్వోకు సీపీఎం నగర కమిటీ ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నాగారం రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ వెనక ఆదివారం రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతున్నాయని సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కమిటీ కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. దీనివల్ల అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. గతంలో ఈ మొరం తవ్వకాల కారణంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు పిల్లల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అప్పుడు ప్రాణాలు కోల్పోయిన పిల్లల తల్లిదండ్రులకు అండగా సిపిఎం నిలిచి అక్కడ తవ్విన గుంటను మూసివేసే అంతవరకు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఆ తవ్విన గుంతని మూసివేసే అంతవరకు సిపిఎం నిరసనలు ఆందోళనను చేసిందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మొరం కారణంగా మళ్ళీ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందో తెలియదని ఎమ్మార్వో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మొరం తవ్వకాలు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నరసయ్య, అడివాలా అనిత, పార్టీ సభ్యులు ఎస్కే శంషు పాల్గొన్నారు.
