27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం

Must read

📰 Generate e-Paper Clip

  • ఇద్దరు నిందితుల అరెస్ట్
  • పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ : ఎల్ జీ (లక్కీ జనరల్స్) ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.. 150 మంది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారని వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని, మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం నిజామాబాద్ వివి నగర్ కాలనీ ముబారక్ నగర్ కు చెందిన మేకల జగదీష్, పెద్ద బోయిన భూమయ్య అలియాస్ ప్రేమ్ సాటాపూర్ కు చెందిన వ్యక్తి ద్వారా ఎల్ జీ ఇండియాకు కు సంబందించిన యాప్ లో రూ.25,500 జమ చేయగా ఎల్లీ ఇండియా సంబంధించిన వీడియోలు రోజుకి 16 చొప్పున చూస్తే ప్రతి వీడియోకు రూ.55 రూపాయలు వస్తాయని అలా రోజు దాదాపు 880 సంపాదించవచ్చు అని నమ్మించారు. కంపెనీకి డబ్బులు పెడితే కంపెనీ యాడ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని అలాగే కంపెనీ నందు తాను లీడర్ గా మారి ఇతరులను జాయిన్ చేస్తే దానికి గాను ఆదనంగా 8 మందికి 4000 చొప్పున 15 మందికి 8000 చొప్పున డబ్బులు వస్తాయని నమ్మించారు. అట్టి ఫిర్యాదుదారుడు ఎల్ జీ ఇండియా యాప్ లో డబ్బులు పెట్టాడు.  ఏజెంట్ల మాయమాటలు నమ్మి అతను గాకుండా అతని రక్త సంబందులకు, తెలిసిన వ్యక్తులకు ఎల్జీ కంపెనీ నందు పెట్టుబడి పెట్టించాడు. మొదట్లో ఇట్టి ఆప్ నందు డబ్బులు వస్తున్నట్లు ఎల్ జీ వాలెట్లో జమ ఐతున్నట్లు కనిపించేవి. దానిని నమ్మి ప్రేమ్, మేకల జగదీష్ దాదాపు 150 మంది వ్యక్తులను నమ్మించి ఎల్లీ కంపెనీ నందు డబ్బులు పెట్టించారు. వాలెట్లో ఉన్న డబ్బులు తమ సొంత ఖాతాలకు మార్చుకొని డబ్బులు వస్తాయని అనుకొనగా అట్టి అకౌంట్లు యందు జమ అయినటువంటి ఏక్ అమౌంట్ విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా అవి విత్ డ్రా కాలేదు. అట్టి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయబడినవి అని తెలుసుకొని తను మోసపోవడమే కాకుండా ఇతరులు కూడా మోసపోయారని తెలుసుకొని ఎల్జి కంపెనీ ఏజంట్లని అడగగా ఇట్టి కంపెనీ ఆపరేట్ ముంబైలో జరుగుతుందని కంపెనీ చీఫ్ రాజు అని చెప్పారు.  మీ డబ్బులు మీకు వస్తాయని కొంతకాలం నమ్మించారు తర్వాత అతను మోసపోయానని తెలిసుకొని రెంజల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ విధంగా నిందితులు దాదాపు గా 150 మంది సాటాపూర్ గ్రామస్తులను మోసం చేసినట్టు తెలిసింది. ఎల్జీ కంపెనీ నందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు విలువ సుమారు 75 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం. కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదు. ఎవరు కూడా ఇలాంటి మోసపురితమైనటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం యందు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు పొందాలని ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టకూడదని, పెట్టి మోసపోకూడదని ఇలాంటి మోసపూరిత మాటలకు ఆకర్షితులు కావద్దని, ఎవరైనా ఇట్టి కంపెనీ పేరులతో పెట్టుబడి పెట్టాలని చెబితే లోకల్ పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇవ్వాలని కోరారు.

More articles

Latest article