27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నెట్ పరీక్ష సందర్భంగా అండర్ సెక్షన్ 163 అమలు

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 25 నుంచి 29 వరకు జరిగే  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్  జూన్ – 2025  సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద అండర్ సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు డివిజన్ లోని పరీక్ష కేంద్రాo వద్ద ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మల్టి షిఫ్ట్ ప్రకారం పరీక్షలు ఉన్నాయని తెలిపారు. ఏవీ ఎంటర్ ప్రైజెస్, మున్నూరు కాపు సంఘం, అర్సపల్లి బై పాస్ రోడ్డు, నిజామాబాదు లో పరీక్షా కేంద్రాo వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేధిత ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ నిషేధిత ఆదేశాలు ఈనెల 29వరకు ఉంటాయని అన్నారు.

More articles

Latest article