. . . డిజిపిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు పై ప్రభుత్వం స్పందించింది. ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసు విచారణ తక్షణమే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిజిపి సివి. ఆనంద్ ను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిజిపి ఆనంధ్ తో బండి భగిరథ్ పై నమోదైన కేసు వివరాల గురించి మాట్లాడారు. కేసు నమోదు విచారణ ఆలస్యం పై వివరణ కోరగా మోడీ పర్యటన భద్రత పర్యవేక్షణ కారణమని తెలిపినట్లు సమాచారం . ఈ కేసు విచారణకు ప్రత్యేక బ్రుంధాలను ఏర్పాటుతో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడిపై నమోదైన కేసు విచారణ చెపట్టి చర్యలు తీసుకోవాలని సోమవారం హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. బండి భగీరత్ పై నమోదైన పోక్సో కేసు పై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సంస్థ చైర్మెన్ సీతా దయాకర్ రెడ్డి పోలీస్ కమీషనర్ ద్వార వివరాలు తీసుకుని విచారణకు బెంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా బిజేపి చీప్ రామచంద్రరావు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు పై స్పందించారు. బండి సంజయ్ మా నాయకుడు అతని గురించి మాకు బాధ్యత ఉంటుంది అతని తనయుడిపై పోక్సో కేసులు నమోదైన అతనికి పార్టీకి సంబంధం లేదన్నారు. కేసు విచారణ అంతా పోలీస్ శాఖ చూసుకుంటుందని అన్నారు.

