. . . మిత్ర పక్షం తో కలిసి ఐదు స్థానాలు కైవసం
. . . బలం లేక పోటికి దూరమైన కమలం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో అధికార పార్టీ హవా చాటింది. సోమవారం జరిగిన కో అప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన మజ్లీస్ తో కలిసి అన్ని స్థానాలను ఎకగ్రీవంగా కైవసం చేసుకుంది. పిబ్రవరిలో మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కో అప్షన్ ఎన్నికల లో చక్రం తిప్పింది. ఐదు స్థానాల్లో రెండు స్థానాలను మజ్లిస్ కు మూడు స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకుంది. అందులో నిజామాబాద్ రూరల్ నుంచి ఒక్కరికి, అర్బన్ నుంచి నలుగురు ఎంపికయ్యారు. బల్ధియా ఎన్నికలలో 28 స్థానాలలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన బిజేపి సరిపడా బలం లేక పోటీకి దూరంగా నిలిచింది. గత నెలలో కో అప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కాగా సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 50 కి పైగా దరఖాస్తులు రాగా చర్చల తరువాత 5 గురు కో అప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. నగర పాలక సంస్థ మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభ్యుల ఎంపికకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎక్స్ అఫిషియో హోదాలో హజరయ్యారు. ఈ సమావేశంలో జనరల్ కోటాలో కాంగ్రెస్ బలపరిచిన బోబ్బిలి మాధురి, కల్లేడ అశోక్, ఎంఐఎం ను ముజీబ్ హైమద్ లను, మైనార్టీ కోటాలో కాంగ్రెస్ నుంచి సర్దార్ నరేందర్ సింగ్, ఎంఐఎం నుంచి ఉజ్మా తరుణంలో పోటి లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అధికారులు ప్రకటించారు. కో అప్షన్ సభ్యులను అధికారులు సన్మానించి నియామక పత్రాలను అందజేశారు.

