కోటగిరి, బతుకమ్మ : కోటగిరి మండల కేంద్రంలో దేశాయి గడి వద్ద వ్యవసాయ భూమిలో నిర్మాణ పనులు చేస్తున్నారని, ఈ నిర్మాణ పనులకు గ్రామ సెక్రెటరీ దగ్గర నుంచి గాని, మండల రెవెన్యూ అధికారి నుంచి గాని ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. స్థల యజమాని మాత్రం అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు కానీ అధికారులు మాత్రం మాకు సమాచారం కూడా లేదని తెలిపారు.

రైస్ మిల్ లేదా గోదాం నిర్మాణ పనులలో మొరం మాత్రం ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరుపుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా వీటికి గ్రామపంచాయతీ నుంచి కూడా అనుమతులు తీసుకోకపోవడం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మొరం మాత్రం నిర్మాణ పనులు తీసిన గుంతల ద్వారా వచ్చిందని యజమాని చెప్పుకురావడం ఓ వింత. దీనిపైన వెంటనే అధికారులు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
