ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రం లో గల మసీద్ లో ఏర్గట్ల మండల తహసిల్దార్ మల్లయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం దువాలో పాల్గొని, ఉపవాస విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, కాంగ్రెస్ మండల రైతు విభాగం అధ్యక్షుడు ముస్కు మోహన్ రెడ్డి, తోర్తి సర్పంచ్ కౌడ భూమన్న, ఏర్గట్ల ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు దోoచంద ఆశిరెడ్డి హన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రెండ్ల రాజరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షుడు మునీర్, మన్నన్, రషీద్, జూంగల గణేష్, మేకల సాయన్న, భూమన్న, బొర్రన్న, షేక్ కరీం, కైలాష్, డి సాయి, మండలం లోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మండల పరిధిలోని గ్రామ ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.
