. . . ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఔట్ సోర్సింగ్ కార్మికులకు వారి వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమం లో ఐఎఫ్ టియు నాయకులు పాల్గొని కార్మికుల కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ ల వారిగా వేతనాలు చెల్లించాలనే నిర్ణయం సరైంది కాదని ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. గ్రూపుల వారిగా చెల్లించాలనే నిర్ణయం మూలంగా కార్మికులకు ఉపాధి భద్రత ఆందోళన, కార్మికుల మధ్య విబేధాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
