29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పరిపాలన గాలికి.. ప్రశ్నిస్తే జైలుకే.. 

Must read

📰 Generate e-Paper Clip

  • వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ 
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  

 

హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలు కు పంపే కార్యక్రమం ను సీ. ఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టుకొన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హైద్రాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో 30 సార్లు డీల్లి కి వెళ్లొచ్చి, అక్రమంగా సంపాదించిన సొమ్ము మూటలను డీల్లికి పంపే పనిలో రేవంత్ నిమగ్నమయ్యాడని ఆయన ఆరోపించారు. పేదోళ్ల ఇండ్లు కూల్చడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం చివరికి పేరు మర్చిపోయిన వారిని కూడా కేసు పెడుతానని బెదిరించే పనిలో సీ. ఎం ఉన్నారని అన్నారు. సీ. ఎం పేరు మర్చిపోవడం ప్రజల తప్పు కాదని, ఏదైనా మంచి పని చేస్తే ప్రజలు పేరు గుర్తుంచుకుంటారని అన్నారు.  రైతుల విషయం లో రైతు భరోసా ను ఒక పంటకు ఎగ్గొట్టి, పంటకు రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రూ. 12 వేలే ఇస్తానని చెప్పి రైతులను మోసం చేసి, రూ. 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి 40 శాతం రైతులకే ఇచ్చి మిగితా వారికి ఇవ్వక ఎగగొట్టే ప్రయత్నం చేస్తూ రైతుల విషయంలో సీ. ఎం పూర్తిగా ఫెయిల్ అయ్యారని అన్నారు. మహిళల విషయంలో కోడలికి రూ. 2500 ఇస్తానని, అత్తకు రూ. 4000 ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, కల్యాణ లక్ష్మి తులం బంగారు ఇవ్వక సీ. ఎం రేవంత్ మహిళల విషయంలో పూర్తిగా విఫలం అయ్యారని దుయ్యబట్టారు. అందుకే ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనెం దుకు డైవర్షన్ పాలిటిక్స్ ప్లై చేస్తున్నాడని అన్నారు. సీ. ఎం వైఫల్యాలను నిలదీసి, ప్రశ్నించిన వారిని,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన వారిని అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపే పనిలో సీ. ఎం నిమగ్నమయ్యారని ఆరోపించారు .నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ కేటీయర్ ఏసీబీ ఇచ్చిన నోటిస్ కు సమాధానం ఇవ్వడానికి తన వ్యక్తిగత అడ్వకేట్లతో వస్తే ఆయన్ని నడి రోడ్డులో కావాలని ఆపి నడిపించాలన్న పిచ్చి ఆలోచనతో కావాలని ఆపి నడిపించారని అన్నారు. అంతే కాకుండా సీ. ఎం కేటీఆర్ పై రైడ్ చేయించి కేటీఆర్ ఇంట్లో అక్రమ డాక్యూమెంట్స్ పెట్టి అక్రమ కేసు పెట్టి జైలు కు పంపాలని చూస్తున్నాడని మా దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఎందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని, అన్ని రోజులు ఒక్కలాగా ఉండవని పోలీసుల పద్ధతిని మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. పోలీసులు ఉన్నది రాజ్యాంగ బద్దంగా పని చేయడానికని, సీ. ఎం చెప్పిన రాజ్యాంగం నడపడానికి కాదని పోలీసులకు ఆయన హితవు పలికారు. కాదని అక్రమ కేసులు పెట్టాలని చేస్తే సీ. ఎం నైనా, పోలీసులనైనా అడ్డుకుంటామని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

More articles

Latest article