28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా హామీ మేరకు రైతులకు రూ.12వేలు రైతు భరోసా, భూమిలేని పేదలకు రూ.12వేలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు ఈ నెల 26 తేదీన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రత్నాకర్, జావేద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, సేవాదళ్ సంతోష్, బొబ్బిలి రామకృష్ణ, ఈసా, అబ్దుల్ అజీజ్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article