రైస్ మిల్లర్లు  రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం

0 1,267

సిపిఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్

కామారెడ్డి,  బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్లు వడ్లు కొనుగోలు చేసే విషయంలో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని సిపిఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కామారెడ్డి సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఆరుగాలం కష్టించి ప్రజలకు అన్నం పెడుతున్న రైతుల కష్టాన్ని గుర్తించకుండా తరుగు,  తేమ పేరుతోటి జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు ఇబ్బందుల గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లా కలెక్టర్  రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారని, మరోపక్క ఈ ప్రభుత్వం జాలి పడితేనే వడ్లను కొనుగోలు చేస్తామని ఆలోచిస్తుందని దానిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లాలో వాహనాల కొరత, గోనెసంచుల కొరత లేకుండా చూడాలని ఆ దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ రైతుకు ఇబ్బంది జరిగిన ప్రధానంగా వడ్లు వరి పండించిన రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే సిపిఎం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తామని ఆయన మరో మారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.